లోపలికి ఎంట్రీ ఇచ్చాకే అర్థమైంది అక్కడ ఏం లేదని.. కల్కి చిత్రంపై నటి షాకింగ్స్ కామెంట్స్

by Anjali |
లోపలికి ఎంట్రీ ఇచ్చాకే అర్థమైంది అక్కడ ఏం లేదని.. కల్కి చిత్రంపై నటి షాకింగ్స్ కామెంట్స్
X

దిశ, సినిమా: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కల్కి 2898’ చిత్రం బాక్సాఫీసును ఏ రేంజ్‌లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌లో బాలీవుడ్, టాలీవుడ్ అగ్ర నటులు తమ అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాల్ని ఆకట్టుకున్నారు. దిశా, పటానీ, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూల్ వంటి నటీనటులు ఈ సినిమాలో నటించారు. వీరితో పాటు అంతగా ఎవరికి పరిచయం లేని కైరా పాత్రలో నటించిన అన్నా బెన్ కూడా కల్కిలో కనిపించి ప్రేక్షకులచే వావ్ అనిపించుకుంది. కనిపించింది కొంతసేపైనా కైరా పోషించిన పాత్రకు ప్రశంసలు అందాయి.

ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను బౌంటీ హంటర్స్ నుంచి రక్షించడంలో కైరా ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీపికాకు సుమతి అని పేరు పెడుతుంది. అంతేకాకుండా ఇందులో హీరోయిన్ కోసం తన ప్రాణాలు సైతం కోల్పోతుంది. ఫైర్ క్రాకర్ లా అటు ఇటు తిరుగుతూ ఈ చిత్రంతో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది అన్నా బెన్. అయితే ఈ బ్యూటీ తాజాగా కల్కి మూవీ గురించి కామెంట్స్ చేసింది. ‘నేను కొట్టుక్కాలి అనే చిత్రంలో నటిస్తున్నప్పుడు కల్కి మూవీలో అవకాశం వచ్చింది.

కానీ సెట్స్ లో అడుగుపెట్టాక అర్థం అయ్యింది. అక్కడ మనం అనుకున్నట్లుగా ఏం ఉండదు. ఒక సెట్ కూడా లేదు. నేచర్ లేదు. ఓన్లీ గ్రీన్ స్క్కీన్ మాత్రమే ఉంటుంది. ఎటువైపు చూసిన గ్రీన్ సెట్ మాత్రమే కనిపిస్తుంటుంది. సెట్ లో ఉన్నది మొత్తం ఆర్టిఫియయల్ టెక్నాలజీ. ఆ కొంచెం స్పేస్ లో మనం ఎలా నటించామన్నదే ఛాలెంజ్. మొదటిసారిగా అలాంటి వాతావరణంలో నటించాను. నాకు అదొక అనుభవం’’ అంటూ కైరా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed