షారుఖ్ నన్ను మోయలేడు అనుకున్నా.. చాలా స్ట్రాంగ్ అని ఆరోజే తెలిసింది: కాజోల్

by Prasanna |   ( Updated:2023-07-31 12:37:36.0  )
షారుఖ్ నన్ను మోయలేడు అనుకున్నా.. చాలా స్ట్రాంగ్ అని ఆరోజే తెలిసింది: కాజోల్
X

దిశ, సినిమా: సూపర్ హిట్ మూవీ ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమా పోస్టర్ ఫొటో షూట్ కోసం షారుఖ్, తనకు మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనను బయటపెట్టింటి కాజోల్. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ స్వీట్ మెమోరీస్ తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ.. ‘ఫొటోషూట్ కోసం చాలా రకాల యాంగిల్స్ ట్రై చేశాం. కానీ ఏది నచ్చకపోవడంతో చివరగా షారుఖ్‌ భుజాలపై నన్ను ఎత్తుకొమన్నారు. ముందు నేను నెర్వస్‌గా ఫీలయ్యాను. అతను నన్ను మోయగలడా అని ఆందోళనతోపాటు జాలి పడ్డాను. కానీ షారుఖ్ నా దగ్గరకొచ్చి ‘దాని గురించి చింతించకండి. నేను బలంగా ఉన్నాను’ అని హామీ ఇచ్చాడు. వెంటనే తన భుజాలపైకి నన్ను ప్రేమగా ఎత్తుకుని బరువుగా అనిపించలేదని చెప్పాడు. దీంతో సెట్‌లో అందరి ముఖాల్లో చిరునవ్వు కనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది. చివరగా ఆ సమయంలో అందరికీ ‘వావ్’ అనిపించినా షారుఖ్ భుజం స్తంభించిపోయి ఉంటుందేమో అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది.

Also Read: యుద్ధం చేయడమే జీవితం కాదు.. ముద్దులు పెట్టడం ఇంపార్టెంట్: శృతి హాసన్

Advertisement

Next Story

Most Viewed