'భారతీయుడు 2' : కాజల్‌తో కమల్ హాసన్ లిప్ కిస్.. ఈమెను కూడా వదల్లేదా??

by Sujitha Rachapalli |
భారతీయుడు 2 : కాజల్‌తో కమల్ హాసన్ లిప్ కిస్.. ఈమెను కూడా వదల్లేదా??
X

దిశ, సినిమా: సాధారణంగా లోకనాయకుడు కమల్ హాసన్ సినిమా అంటే మినిమమ్ ఉంటది. అయితే దాంతోపాటు హీరోయిన్ తో లిప్ కిస్ కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఒక్క అసిన్ తో తప్ప ఇప్పటివరకు పనిచేసిన ప్రతి హీరోయిన్ ముద్దును ఆస్వాదించాడనే ముద్ర కమల్ పై పడిపోయింది. ఈ క్రమంలో ' భారతీయుడు 2' లో ఆయనకు జోడీగా కాజల్ నటిస్తుండగా.. తనతో కూడా ఈ పాలసీ కంటిన్యూ చేశాడనే వార్తలు వస్తున్నాయి. కాజల్ - కమల్ లిప్ లాక్ ను సినిమాలో చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. కాగా ఈ చిత్రం చందమామ సెకండ్ ఇన్నింగ్స్ కు ప్లస్ అవుతుందని నమ్ముతున్న అభిమానులు.. ఈ విషయం తెలిసి తేడా రాదు కదా అని వర్రీ అయిపోతున్నారు.

కాగా సిద్ధార్థ్, రకుల్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న సినిమాను శంకర్ డైరెక్ట్ చేస్తుండగా.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా కాజల్ జూన్ 7న సత్యభామగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. తల్లి అయిన తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed