కూటమిని కాదని, వైసీపీకి సపోర్ట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ఫోటో?

by Jakkula Samataha |
కూటమిని కాదని, వైసీపీకి సపోర్ట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న ఫోటో?
X

దిశ, ఫీచర్స్ : ఎన్నికల వేళ జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈసారి సినీ ఇండస్ట్రీ మొత్తం ఏపీ ఎన్నికలపైనే దృష్టి పెట్టింది. పవన్ గెలుపు కోసం తమ వంతుగా సపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ కావడంతో, ఆయన టీడీపీకే సపోర్ట్ ఇస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఓటు వేసే క్రమంలో ఒక్కసారిగా నందమూరి అభిమానులకు బిగ్ షాకిచ్చాడనే చెప్పవచ్చు.

తారక్ బ్లూ కలర్ షర్ట్ ధరించి ఓటు వేశారు. ప్రస్తుతం ఇది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గ మారిపోయింది. దీని గురించి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. తారక్ కూటమికి సపోర్ట్ చేస్తారు అనుకున్నాం కానీ, చివరిలో ఆ విధంగా వైసీపికి ప్రచారం చేస్తారని ఊహించలేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ దీనిపై నందమూరి, తారక్ అభిమానులు మాత్రం ఫైర్ అవుతున్నారు. ఆయన కామన్‌గా అనుకోకుండా ఆ షర్ట్ ధరించవచ్చు. దీనికే అంత రచ్చ చేయాలా? అయినా ఆయన తన తాత స్థాపించిన టీడీపీని కాదని వైసీపీ ఎలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు. ఇకనైనా ఇలా ట్రోల్ చేయడం మానేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు వారి కుటుంబంతో కలిసి పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed