ఆ సీనియర్ నటి కాళ్లు పట్టుకున్న జూ.ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-06-24 10:30:15.0  )
ఆ సీనియర్ నటి కాళ్లు పట్టుకున్న జూ.ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ మనవడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జూ.ఎన్టీఆర్.. తనదైన నటనతో, డాన్స్ లతో సినిమాలు చేస్తూ అందర్నీ అలరిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. తాజాగా సీనియర్ నటి సుధా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తారక్ గురించి ఆసక్తి కర మైన విషయం ఒకటి బయటకు వెల్లడించింది. తారక్ తో నటించేటప్పుడు ఆమె ఓ ఇన్సిడెట్ ను గుర్తు చేసుకున్నారు. బాద్షా సినిమా చేసేటప్పుడు ఆడవాళ్ళతో కలిసి ఎన్టీఆర్ డాన్స్ చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో ఎన్టీఆర్, సుధాతో కలిసి ఒక స్టెప్ వేశారు. అయితే ఆ సమయంలో ఆమె కాలు స్లిప్ అయ్యిందట, అప్పుడు ఎన్టీఆర్ వెంటనే ఆమె కాలు పట్టుకొని..మీకు ఏమి కాదంటూ.. స్ప్రే తెప్పించి కాలుకు స్ప్రే చేశారట. అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా తన కాలు పట్టుకొని అమ్మ అంటూ ఎంతో బాగా చూసుకున్నారట. ఆమె ఈ విషయం గురించి గుర్తుచేసుకొని ఎన్టీఆర్ చాలా మంచివాడు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: ‘గుంటూరు కారం’ షూటింగ్ బరిలోకి దిగిన మహేష్ బాబు..

Advertisement

Next Story