బ్రేకింగ్: ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి Jr NTR డుమ్మా.. అదే కారణమా..?

by Satheesh |   ( Updated:2023-08-28 06:21:42.0  )
బ్రేకింగ్: ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి Jr NTR డుమ్మా.. అదే కారణమా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ వ్యవస్థాపకుడు, ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.100 ఎన్టీఆర్ స్మారక చిహ్నాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. కాగా, ఢిల్లీలో జరిగే ఈ నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను, సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌తో కలిసి పని చేసిన సన్నిహితులను ఆహ్వానించారు.

మరి కాసేపట్లో ఈ కార్యక్రమం స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఏపీ మాజీ సీఎం, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్, ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి, ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అయితే, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సీనియర్ ఎన్టీఆర్ మనువడు, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దూరంగా ఉన్నాడు. ఎన్టీఆర్ రూ. 100 స్మారక నాణెం విడుదల ఫోగ్రామ్‌కు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

అయితే, ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్ కారణంగానే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నిర్వహిస్తోన్న ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆయన మనువడు ఎన్టీఆర్ హాజరు కాకపోవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More : బట్టతలతో ప్రభాస్.. వైరల్ అవుతున్న డార్లింగ్ షాకింగ్ ఫొటోస్

Advertisement

Next Story