రాజమౌళి-మహేశ్ బాబు సినిమాలో Jr.NTR కుమారుడు?

by Anjali |   ( Updated:2023-07-24 04:20:52.0  )
రాజమౌళి-మహేశ్ బాబు సినిమాలో Jr.NTR కుమారుడు?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తారక్ కుటుంబానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభిరామ్.. హీరో మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్టీఆర్ తన పిల్లల విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ‘‘చదువుకునే వయస్సులో తారక్ కుమారులు సోషల్ మీడియాపై దృష్టి పెడితే ఆ ప్రభావం చదువుపై పడుతుందని’’ ఎన్టీఆర్ భావిస్తున్నారని టాక్. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Also Read..

మరో మహిళతో భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన జూనియర్ ఎన్టీఆర్.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్

Advertisement

Next Story