ఫ్యాన్స్‌కు పబ్లిక్‌గా క్షమాపణ చెప్పిన Jr.NTR

by sudharani |   ( Updated:2022-09-04 06:46:27.0  )
ఫ్యాన్స్‌కు పబ్లిక్‌గా క్షమాపణ చెప్పిన Jr.NTR
X

దిశ, వెబ్‌డెస్క్: రణ్‌బీర్, అలియా జంటగా తెరకెక్కుతున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాను సౌత్‌లో రాజమౌళి ప్రెజెంట్స్ చేస్తుండటంతో.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు తెలుగులో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌ను తెలుగులో గ్రాండ్‌గా చేసేందుకు హైదారాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎన్టీఆర్‌ను పిలవడంతో.. రెండు రోజులపాటు సోషల్ మీడియాలో ''NTR from Brahmastra'' అనే హాష్ ట్యాగ్‌తో అభిమానులు సందడి చేశారు.

తీరా ఈవెంట్‌కు పోలీసులు నిరాకరించడంతో హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మైక్ పట్టుకోగానే ముందుగా అభిమానులకు క్షమాపణలు చెప్పుకున్నారు. వినాయకచవితి కారణంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పి పర్మిషన్ రద్దు చేశారు. ఒక దేశ పౌరుడిగా వారి రిక్వెస్ట్‌ని అంగీకరించి.. వారు మన గురించి ఆలోచిస్తారు కాబట్టి ఈవెంట్ అక్కడ చేయలేక పోయం. అందుకే ఇలా చిన్న వేదికపై మీ ముందు ఉన్నామని అన్నారు. అంతేకాకుండా ఇలా జరిగినందుకు నేషనల్, తెలుగు మీడియాలకు కూడా క్షమాపణ చెప్పారు ఎన్టీఆర్.

ఇవి కూడా చ‌ద‌వండి : NTR vs KCR.. మధ్యలోకి దూరిన కళ్యాణ్ రామ్?

Advertisement

Next Story