- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jeevitha-Rajashekar :: దంపతులకు ఏడాది జైలు శిక్ష.. నాంపల్లి కోర్టు కీలక తీర్పు
దిశ, వెబ్‌డెస్క్: సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులకు బిగ్ షాక్ తగలింది. పరువు నష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. కాగా, 2011లో జీవిత, రాజశేఖర్ దంపతులు స్టార్ హీరో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై రియాక్ట్ అయిన ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు. జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. అంతేకాదు ఈ కేసుపై అప్పీలుకు వెళ్లేందుకు ఛాన్స్ ఇస్తూ షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.