- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యతో జయం రవి విడాకులు.. సెన్సేషనల్ పోస్ట్ పెట్టిన ఆర్తి.. మళ్లీ కలిసిపోతున్నారా?
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో జయం రవి, ఆర్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల జయం రవి సోషల్ మీడియా ద్వారా తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇద్దరి అంగీకారంతోనే విడిపోతున్నట్లు తెలిపాడు. అయితే వీరిద్దరి వ్యవహారం కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఆర్తి తనకు తెలియకుండా ఎలా డైవర్స్ ఇస్తాడని ఓ నోట్ విడుదల చేయడంతో అంతా అయోమయంలో పడిపోయారు. ఇంతలో వీరి విడాకులకు ఓ సింగర్ కారణమంటూ తెరపైకి పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక వాటిపై ఆమె స్పందించి అధికారికంగా పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. దీంతో నెట్టింట సరికొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది. జయం రవి సోషల్ మీడియా ఖాతాలు ఆర్తి ఆధీనంలో ఉన్నాయని వాటిని అతనికి అప్పగించకుండా ఇబ్బంది పెడుతోందనే పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఆర్తి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి నానారకాలుగా ప్రచారం జరుగుతోంది. నన్ను చెడుగా చిత్రీకరించి నిజాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నేను అయినా మౌనంగా ఉంటున్నానంటే తప్పు చేసినట్లు కాదు. హుందాగా వ్యవహరించాలనుకున్నాను.
నాకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. అతడు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నాం అని లేఖ విడుదల చేసినప్పుడు నేను అది చూసి షాకయ్యాను. అయితే అప్పుడు నా మాటలు కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో ఇప్పటికీ నేను అతనితో వ్యక్తిగతంగా మాట్లాడటానికి అవకాశం ఉందేమోనని ఎదురుచూస్తున్నాను. వివాహ వ్యవస్థను నేను గౌరవిస్తాను ఇరువురి ప్రతిష్టను దెబ్బతీసే చర్చలు నేను ఎంకరేజ్ చేయను. నా కుటుంబ క్షేమమే నాకు ముఖ్యం’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ ఆర్తి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా మళ్లీ కలిసిపోతున్నారా? అందుకే ఆమె అతనితో మాట్లాడుతా అని హింట్ ఇచ్చిందని చర్చించుకుంటున్నారు.