- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > Indian Idol: ఇండియన్ ఐడల్ స్టేజ్’పై పాటతో అదరగొట్టిన జవాన్.. నెటిజన్లు ఫిదా!
Indian Idol: ఇండియన్ ఐడల్ స్టేజ్’పై పాటతో అదరగొట్టిన జవాన్.. నెటిజన్లు ఫిదా!

X
దిశ, సినిమా: ప్రేక్షకులను అలరించేందుకు ‘తెలుగు ఇండియన్ ఐడల్’ రెండో సీజన్ సిద్ధమైంది. మార్చి 3నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7గంటలకు ఈ షో ప్రీమియర్ కానుంది. ఇందులో భాగంగా మొదటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో చక్రపాణి అనే ఓ భారత జవాన్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలోని ‘ఘల్.. ఘల్’ అనే పాట పాడి అదరగొట్టారు. ఇక అతడి గొంతువిన్న జడ్జీలు అతడిపై ప్రశంసలు కురిపిస్తూ సెలక్ట్ చేశారు. కానీ, ఆ జవాన్ నో అన్నాడు. ఎందుకంటే ‘నాకు పాటలంటే ఇష్టం. కానీ, ప్రాక్టీస్ చేసేందుకు టైమ్ ఉండదు. డ్యూటీ చేస్తూ ఏదో పాడుకుంటాను. ఇక నా సెలవులు కూడా ముగిశాయి. బార్డర్‌కు తిరిగి వెళ్లే సమయం వచ్చింది’ అని చెప్పాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా నిలబడి జవాన్‌కు సెల్యూట్ చేశారు.
Next Story