- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒకే ఓటీటీ ప్లాట్ ఫాంపై ‘జవాన్’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే..!
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాదిలో సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాలు ‘జవాన్’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ రెండు మూవీస్ ఈరోజు (సెప్టెంబర్-7) విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ రెండు సినిమాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. సాధారణంగా కొత్త సినిమాలు రిలీజైన నాలుగు వారాలకు ఓటీటీ ప్లాట్ ఫాంపై సందడి చేస్తాయి. యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు అయితే.. రెండు, మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తాయి. ఇక కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి దర్శనమిస్తాయా అని చూసే వారికి ఓ గుడ్ న్యూస్ దొరికిందనే చెప్పాలి. ‘జవాన్’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాల డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
అయితే.. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో నాలుగు వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది.