శ్రీలీల, మంగ్లీ మధ్యలో నలిగిపోయిన డైరెక్టర్ అనుదీప్.. సుప్పినీ సుద్దపూసనీ అంటున్న నెటిజన్లు (వీడియో)

by Hamsa |   ( Updated:2024-08-15 12:04:58.0  )
శ్రీలీల, మంగ్లీ మధ్యలో నలిగిపోయిన డైరెక్టర్ అనుదీప్.. సుప్పినీ సుద్దపూసనీ అంటున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్రిన్స్, పిట్టగోడ, వంటి చిత్రాలు తెరకెక్కించాడు. ముఖ్యంగా 2021లో వచ్చిన జాతిరత్నాలు సినిమాలు ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే ఆయన ప్రస్తుతం సినిమాలు తెరకెక్కించనప్పటికీ పలు షోస్, ప్రీరిలీజ్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. ముఖ్యంగా ఆయన తన బిహేవియర్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా, ఆయ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అనుదీప్ కూడా పాల్గొని సందడి చేశాడు.

అయితే ఈ వేడుకల్లో సింగర్ మంగ్లీ, శ్రీలీల కూడా పాల్గొన్నారు. ప్రజెంట్ ఈ ముగ్గురు ఒకే చోట ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్‌లో అనుదీప్ కూర్చొని ఉండగా.. ఓ వైపు శ్రీలీల, మరోవైపు మంగ్లీ కూర్చున్నారు. ఇక ఇద్దరి మధ్యలో నలిగిపోతూ నానా తంటాలు పడ్డాడు. ముఖ్యంగా ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ నవ్విస్తున్నాయి. వీళిద్దరూ నా దగ్గర నుంచి వెళ్లిపోతే బాగుండు అన్నట్లు ఆయన ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. ఇక అనుదీప్ వీడియో చూసిన నెటిజన్లు 90s మిడిల్ క్లాస్ సుప్పినీ సుద్దపూసని పాటను పెట్టి నెట్టింట షేర్ చేస్తున్నారు. అలాగే ఇంట్రోవర్టులు భయపడే విషయం ఇద్దరు అమ్మాయిల మధ్యలో కూర్చోవడమే అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed