Janhvi Kapoor: ఆ వెబ్‌సైట్‌లో దారుణమైన ట్రోల్స్.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |
Janhvi Kapoor: ఆ వెబ్‌సైట్‌లో దారుణమైన ట్రోల్స్.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఉలఝ్’. సుధాంశు సరియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నుంచి విడుదలకు ముందు రిలీజైన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశాయి. అలాగే ట్రైలర్ కూడా మూవీపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక భారీ అంచనాల మధ్య ‘ఉలఝ్’ ఆగస్టు 2న థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారాయి.

సాధారణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చాలా కామన్. అయితే.. ఆ ట్రోల్స్ కొంతమంది సెలబ్రెటీలు పట్టించుకుంటారు. మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్ రెడిట్‌లో వచ్చే ట్రోల్స్‌పై స్పందించి జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నాకు సోషల్ మీడియా అంటే భయం. దానికి దూరంగా ఉంటాను. ‘రెండిట్‌లో చాలా మంది నిన్ను ట్రోల్స్ చేస్తున్నారు అక్క’ అని ఖుషీ నాకు చెప్పింది. అప్పటి వరకు కూడా నాకు తెలియదు. అసలు వాటిపై ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కాలేదు. చాలా దారుణమైన ట్రోల్స్ కూడా ఉన్నాయి. అయితే.. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ నేను పట్టించుకోను. ఇక వాటిని కూడా పట్టించుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed