సోదరికి జాన్వీ డేటింగ్ అడ్వైజ్.. వాళ్లతో జాగ్రత్త అంటూ

by srinivas |   ( Updated:2022-10-20 13:56:46.0  )
సోదరికి జాన్వీ డేటింగ్ అడ్వైజ్.. వాళ్లతో జాగ్రత్త అంటూ
X

దిశ, సినిమా : బీ టౌన్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తన సోదరి ఖుషీ కపూర్‌కు డేటింగ్‌, లవ్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన సలహాలిచ్చింది. తన రాబోయే చిత్రం 'మిలీ' ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న జాన్వీ.. 'ఆర్చీస్‌' సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్న చెల్లి ఖుషికి చెప్పిన చిట్కాలు పాటించాలని సూచించింది. ఈ మేరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేటింగ్ చేయకూడదన్న జాన్వీ.. కెరీర్‌లో ఉత్తమ నటిగా ఎదిగాలంటే ఈ సజెషన్ తప్పకుండా పాటించాలని, ఇందుకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయని చెప్పింది.

అలాగే సోషల్ మీడియాలో నిరంతరం తమ గురించి ఏం మాట్లాడుతున్నారనే విషయాలను పట్టించుకోవద్దన్న ఆమె.. అన్నింటికన్నా ముందు తన విలువను తానే గుర్తించుకోవాలని, సొంత బలం, బలహీనతల గురించి పూర్తిగా తెలుసుకోవాలని చెప్పింది. చివరగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రమే మనలను ప్రత్యేక స్థానంలో నిలబెడుతుందని వెల్లడించింది. ఇక జాన్వీ కపూర్ నటించిన 'మిలీ' నవంబర్ 4, 2022న విడుదల కానుండగా.. ఖుషీ కపూర్‌ నటించిన 'ఆర్చీస్' 2023 నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

1.షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇక పాస్‌వర్డ్ షేరింగ్ కుదరదు

Advertisement

Next Story