‘#NTR30’ మూవీ నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్‌ లుక్

by sudharani |   ( Updated:2023-03-08 10:26:30.0  )
‘#NTR30’ మూవీ నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్‌ లుక్
X

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్ హీరో‌గా, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్30’ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా సాగుతున్న ఈ మూవీ షూటింగ్‌ను నందమూరి తారక రత్న మరణం కారణంగా వాయిదా వేశారు. ఇక మార్చి 20న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని మేకర్స్ తెలిపారు. కాగా ఈ రోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్బంగా ఈ మూవీ నుంచి జాన్వీ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో జాన్వీ తల్లి శ్రీదేవి మస్తు అందంగా కనిపించింది.

ఏదేమైనప్పటికీ తెలుగులో ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్న జాన్వీ ఈ తాజా మూవీ‌తో ఎలాంటి ఫేమ్‌ను సంపాదించుకుంటుందో చూడాలి. ఎందుకంటే ఆమెను ఇప్పటి వరకు బాలీవుడ్‌లో హాట్ హాట్ లుక్‌లో చూశాం. కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తున్న ఆమె ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ‘ఎన్టీఆర్30’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి : Romancham: సినిమాకు పెట్టింది రూ. 2 కోట్లు.. కానీ రాబట్టింది రూ.50 కోట్లు

Advertisement

Next Story