ఇందుకే కదా పవన్ కల్యాణ్‌ను ఫ్యాన్స్ దేవుడు అనేది!

by GSrikanth |   ( Updated:2023-05-10 14:15:33.0  )
ఇందుకే కదా పవన్ కల్యాణ్‌ను ఫ్యాన్స్ దేవుడు అనేది!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందే ఉంటారు. రాజకీయాల్లో రాకముందు కూడా ఎవరైనా సమస్యల్లో ఉన్నట్లు తన దృష్టికి వస్తే వెతుక్కుంటూ వెళ్లి హెల్ప్ చేసిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా.. మరోసారి జనసేనాని తన మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి కోనసీమ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన్ను చూసేందుకు భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేయలేక నీరసించిపోయిన పోలీసు ఆఫీసర్‌కు స్వయంగా పవన్ కల్యాణ్‌ ఎనర్జీ డ్రింక్ ఇవ్వడం విశేషం. దీంతో ‘‘ఇందుకే కదా అన్నా నిన్ను దేవుడు అనేది’’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండగా.. ‘‘ఇదిరా పవన్ కల్యాణ్ అంటే’’ అంటూ మరికొందరు ఫ్యాన్స్ ఫొటోలు పెట్టి ట్రెండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇంతకూ ఏం రాశారు..? గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌కు నారా లోకేశ్ లేఖ



Advertisement

Next Story