తోటి యాంకర్ల కులాలపై సంచలన కామెంట్స్ చేసిన జబర్దస్త్ రష్మీ..!

by Kavitha |
తోటి యాంకర్ల కులాలపై సంచలన కామెంట్స్ చేసిన జబర్దస్త్ రష్మీ..!
X

దిశ, సినిమా: ‘జబర్దస్త్’ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రష్మీ కూడా ఒకరు. స్మాల్ స్క్రీన్ పై యాంకర్‌గా అలరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కెరీర్ తొలినాళ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కరెంట్, హోలీ వంటి సినిమాల్లో నటించింది. తర్వాత యాంకర్‌గా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో తన వచ్చిరాని తెలుగుతో ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత ‘గుంటూర్ టాకీస్’, ‘రాణి గారి బంగ్లా’, ‘అంతం’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తన అందంతో కవ్వించింది. ఇలా ఓ వైపు షోలతో, మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రష్మీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ..తన కెరీర్ విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.

ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకున్న రష్మీ జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేది. ఈ క్రమంలోనే తాజాగా రష్మీ నెటిజన్లతో పెద్ద గొడవకు దిగింది. ఓ నెటిజన్ రష్మీ కులం పై కామెంట్ చేశాడు. రష్మీ బ్రాహ్మణ కులానికి చెందిన వారు. చిన్నప్పటి నుంచి ఆమె కులంలో శాకాహారం అలవాటు చేశారు. మాంసం ఎలాగూ తినకూడదు కాబట్టి జంతువులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తోంది. తాను తినే ఫుడ్ గొప్ప అని అందరి మీద రుద్దడానికి జంతువులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తోందని కామెంట్ చేశాడు. దీనిపై రియాక్ట్ అయిన రష్మీ..నేను నా కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నానని తెలిపింది. అయితే నా కులానికి జంతువులపై ప్రేమకి ఎలాంటి సంబంధం లేదని రష్మీ క్లారిటీ ఇచ్చింది.

ఈ క్రమంలో మరో నెటిజన్.. ఇతర కులాల్లో మీ కన్నా టాలెంట్ ఉండి రాత్రి పగలు కష్టపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీకు మించిన అవకాశాలు రావాలి. కానీ నీతో పాటు, అనసూయ, శ్యామల, శ్రీముఖి, వర్షిణి, విష్ణుప్రియ, మంజూష లాంటి యాంకర్స్ అంతా ఎక్కువ మంది బ్రాహ్మణ, కమ్మ కులానికి చెందిన వారే కాబట్టి మీకు అవకాశాలు వస్తున్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

దీనిపై రష్మీ ఘాటుగా స్పందించింది. వెళ్లి వాళ్ళందరి క్యాస్ట్ సెర్టిఫికెట్స్ చెక్ చేసుకోండంటూ ఆ నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. మీరు చెప్పిన వాళ్లంతా హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చారు. కులం వల్ల కాదు. పైగా మేమంతా టీవీల్లో సక్సెస్ అయ్యాం. సినిమాల్లో కాదు. మీరు చెప్పినట్టు కులం వల్లే అవకాశాలు వచ్చేలా ఉంటే మేము సినిమాల్లో కూడా సక్సెస్ అయి ఉండాలి కదా అంటూ ఆ నెటిజన్‌కు రష్మీ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.








Advertisement

Next Story

Most Viewed