Jabardasth కమెడియన్ Yadamma Rajuకు యాక్సిడెంట్.. భార్య చేసిన పనికి తిట్టిపోస్తున్న Netizens (వీడియో)

by Hamsa |   ( Updated:2023-07-25 05:59:28.0  )
Jabardasth కమెడియన్ Yadamma Rajuకు యాక్సిడెంట్.. భార్య చేసిన పనికి తిట్టిపోస్తున్న Netizens (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర కమెడియన్ యాదమ్మరాజు జబర్దస్త్‌ షోలో తన యాసతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ప్రేక్షకులను అలరించాడు. ఇటీవల యదమ్మ రాజు తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే యాదమ్మ రాజుకు యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తుంది.

తాజాగా, ఈ విషయాన్ని ఆయన భార్య స్టెల్లా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసి తెలిపింది. ‘‘ యాదమ్మ రాజుకు చిన్న యాక్సిడెంట్ అయింది. కాలు విరిగింది.. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులందరికీ థాంక్స్’’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కొంత మంది యాదమ్మ రాజు త్వరగా కోలుకోవాలని కోరుతుండగా.. మరికొంత మంది స్టెల్లా చేసిన పనికి బూతులు తిడుతున్నారు. ఎందుకంటే.. భర్త హస్పిటల్‌లో ఉన్నా రీల్స్ చేయడం.. దాన్ని కూడా లైక్స్ కోసం వాడుకోవడం అవసరమా? ఇలాంటి సీరియస్ విషయాన్ని కూడా రీల్స్ చేసి చెప్పాలా? అంటూ తిడుతున్నారు.

Advertisement

Next Story