జబర్దస్త్ యాంకర్ రష్మికి బెదిరింపులు.. యాసిడ్ పోస్తామని వార్నింగ్

by Javid Pasha |   ( Updated:2023-02-27 09:48:16.0  )
జబర్దస్త్ యాంకర్ రష్మికి బెదిరింపులు.. యాసిడ్ పోస్తామని వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ షో యాంకర్ రష్మి గురించి తెలియని తెలుగు టీవీ ప్రేక్షకలు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయంతో రష్మి తన ఫ్యాన్స్ ను అంతలా కట్టిపడేసింది మరి. కాగా తాజాగా రష్మిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, సైటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. అందుకు కారణం ఇటీవల హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో ఓ నాలుగేళ్ల బాలుడు చనిపోవడం. అయితే ఆ బాలుడి మరణానికి ఈ స్టార్ యాంకర్ కి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ ఘటన తర్వాత స్పందించిన రష్మి.. ‘‘కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం బాధాకరం. కానీ వీధి కుక్కలకు కూడా ఏదైనా వసతి కల్పిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు’’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఆమెను రకరకాలుగా ట్రోల్ చేస్తూ వార్నింగ్ ఇస్తున్నారు. రష్మి కుక్కను కుక్కను కొట్టినట్లు కొట్టాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘‘ నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టిదానా. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. లేకుండే యాక్సిడెంట్ అవుతుంది. యాసిడ్ పోస్తా. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడుతావ్’’ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ట్వీట్ కు రష్మి గౌతమ్ బదులిస్తూ ‘‘కొన్ని రోజుల కిందట ఈ వ్యక్తి నుంచి నా వయసు, పెళ్లి గురించి కొన్ని అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చాయి. ఇప్పుడేమో చేతబడి చేస్తా.. యాసిడ్ పోస్తా అంటూ బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తిపై పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలా లేక వద్దా’’ అంటూ రష్మి ట్వీట్ చేసింది.

Advertisement

Next Story