ఇరవై ఎకరాలు ఇస్తే శోభనానికి ఓకే అంటున్న జబర్దస్త్ వర్ష!

by Jakkula Samataha |
ఇరవై ఎకరాలు ఇస్తే శోభనానికి ఓకే అంటున్న జబర్దస్త్ వర్ష!
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్లకు తీసిపోని అందం ఈమె సొంతం.ఈమె కమెడియన్ ఇమ్మాన్యుయెల్‌తో స్కిట్స్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతే కాకుండా వీరి మధ్య లవ్ ఉన్నట్లు, ఒకరిపై ఒకరికి ప్రేమ, పెళ్లి చేసుకోవాలని చూడటం ఇవన్నీ నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో వీరు బెస్ట్ కమెడియన్ జోడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా వర్ష, ఇమ్యాన్యుయెల్ స్కిట్ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ, అందరినోట నవ్వులు పూయిస్తోంది.

స్కిట్‌ ప్రోమోలోకి వెళ్తే.. ఇమ్యాన్యుయెల్ పెద్ద భూస్వామి, ఆయనకు ఒక కొడుకు అజార్. ఆయనకు 20 ఎకరాలపైన ఉంది. మా నాన్నకు నాకు పెళ్లైంది, కొడుకు ఉన్నాడని అబద్ధం చెప్పాను అని వర్ష‌కు భర్తగా నటిస్తున్న రియాజ్‌కు చెప్తాడు. దీంతో ఇరవై ఎకరాలు ఇస్తానంటే, అజార్‌కు భార్యగా నటించమని వర్షను ఒప్పిస్తాడు. దీంతో రియాజ్ వర్ష, అజార్‌కు కొడుకుగా, వారిద్దరు భార్యభర్తలుగా నటిస్తారు. ఈ క్రమంలో అజార్‌కు తండ్రి ఇమ్మాన్యుయెల్ శోభనం ఏర్పాటు చేయడంతో రియాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. రియాజ్ ఇమ్మాన్యుయెల్‌ని శోభనం ఎవరికీ అని అడగ్గా మీ అమ్మనాన్నకు అని చెప్పడంతో అక్కడున్నవారందరూ తెగ నవ్వుతారు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed