కఠిక దారిద్ర్య జీవితాన్ని గడుపుతున్న నటికి జబర్దస్త్ ఆఫర్!

by Anjali |   ( Updated:2023-03-23 08:25:32.0  )
కఠిక దారిద్ర్య జీవితాన్ని గడుపుతున్న నటికి జబర్దస్త్ ఆఫర్!
X

దిశ, వెబ్‌డెస్క్: నటి పాకీజా అలియాస్ వాసుకి పేరు వినగానే అందరికి గుర్తుకొచ్చేది ఆమె కామెడీ సీన్స్. బ్రహ్మనందంతో కలిసి అసెంబ్లీ రౌడీ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. అలాగే ప్రముఖ నటుడు మోహన్ బాబు సినిమాల్లో కూడా చాలా పాత్రల్లో నటించారు. తమిళంలో 250కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇలా వరుస సినిమాల్లో నటించి ఆమె కోట్ల రూపాయలు సంపాదించింది. అయితే, సినిమాలలో నటిస్తున్నప్పుడు విలాసాలలో మునిగి తేలి ఆ తరువాత కఠిక దారిద్ర్య జీవితాన్ని గడిపినవారు ఎందరో ఉన్నారు. వందల్లో సినిమాలు చేసి.. వచ్చిన డబ్బును నిలుపుకోలేక ఇబ్బందులు పడుతున్న వారు ఇప్పటికి చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో కమెడియన్ పాకీజా వాసుకి కూడా ఒకరు.

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘కుటుంబం సమస్యల్లో ఉన్నందున డబ్బును పొగొట్టుకొన్నాను. తినడానికి కూడా కష్టంగా ఉంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను, వైద్యానికి కూడా డబ్బులు లేవు.. ఎంతో మంది తమిళ హీరోయిన్లను సాయం చేయమని వేడుకున్న ఎవరు ముందుకు రాలేదు’’ అంటూ ఆమె తమ కష్టాలను చెప్పుకొచ్చింది. ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకీజాకి ‘జబర్దస్త్’లో అనుకోకుండా అవకాశం వచ్చింది. తాజాగా లేటెస్ట్ ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎపిసోడ్‌లో ఆమె ‘రైజింగ్ రాజు’తో కలిసి స్కిట్ చేశారు. వాసుకి ఉన్న ఇబ్బందుల రీత్యా ఆమె ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా చేస్తున్నారు. కాబట్టి జబర్దస్త్ వాళ్ళు ఆమెను ఎన్నాళ్ళు కొనసాగిస్తారో చూడాలి. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ ఎపిసోడ్‌కి దాస్ కా ధమ్కీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విశ్వక్ సేన్ రావడం విశేషం.

Also read: మార్చి 23 అమరవీరుల దినోత్సవం : సోనూసూద్ ఇంట్రస్టింగ్ పోస్ట్..

Advertisement

Next Story