నా లవర్ అందులో నాలుగు సార్లు అడ్డంగా దొరికింది.. వాళ్ల కోరికలు తీర్చుతుంది కానీ నన్నే: స్టార్ నటుడు

by Disha Web Desk 9 |
నా లవర్ అందులో నాలుగు సార్లు అడ్డంగా దొరికింది.. వాళ్ల కోరికలు తీర్చుతుంది కానీ నన్నే: స్టార్ నటుడు
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే వర్ష ఇమ్మాన్యుయల్ జోడి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. జబర్దస్త్ వేదికన ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. జబర్దస్త్ ద్వారా సెన్సేషన్ అయిన వర్ష అండ్ ఇమ్మాన్యుయేల్ పలు ప్రముఖ షోల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికి టాప్ కమెడియన్స్‌గా బుల్లితెరపై దూసుకుపోతున్నారు. అంతేకాకుండా పలు సీరియల్స్‌లోనూ కనిపించిన విషయం తెలిసిందే. అలాగే స్పెషల్ ఈవెంట్లలో కూడా దర్శనమిస్తుంటారు. పలు చిత్రాల్లో క్రేజీ పాత్రల్లో కనిపించి తమదైన సత్తా చాటుకున్నారు.

ఇకపోతే రీసెంట్‌గా ఓ షోలో స్కిట్‌లో భాగంగా ఇమ్మాన్యుయేల్.. వర్ష బండారం బయటపెట్టాడు. ప్రస్తుతం వీరిద్దరు మనసంతా నువ్వే అనే షోను హోస్ట్ చేస్తున్నారు. ఇందులో వర్షను హిమ్ము.. ‘రెండు రాష్ట్రాల ప్రజలు మనల్ని జోడిగా చూడాలని కోరుకుంటున్నారు వర్ష. అందరి కోరికలు తీర్చుతున్నావు కానీ నా కోరిక మాత్రం తీర్చట్లేవు అంటూ నాటీగా అంటాడు ఇమ్మాన్యుయేల్. తర్వాత మరో సందర్భంలో వర్ష ఫోన్ హిస్టరీ చూసినప్పుడు నాలుగు సార్లు అడ్డంగా దొరికింది, షాక్ అయ్యాను’ అంటూ ఇమ్మాన్యుయల్ వర్షపై ఫన్నీ పంచెస్ వేస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed