అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్!

by Anjali |   ( Updated:2023-07-09 05:11:10.0  )
అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్!
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్న ముక్కు అవినాష్ తన అభిమానులకు గుడ్‌న్యూస్ తెలిపారు. అవినాష్.. తన భార్య యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోలు చూసి నెటిజన్లు మీ భార్య ప్రెగ్నెంటా? అంటూ చాలాసార్లు రూమర్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం దీనిపై అవినాష్ స్పందించి.. తన భార్య ప్రెగ్నెంట్‌తో ఉందని స్వయంగా తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నాడు. ‘నా భార్య అనుజకు ఇప్పుడు నాలుగో నెల. త్వరలోనే మేము తల్లిదండ్రులం కాబోతున్నామని, మరో ఐదు నెలల్లో మా జీవితంలోకి మరో చిన్నారి రాబోతుంది. ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నాం’ అంటూ ముక్కు అవినాష్‌ వెల్లడించారు. ఈ సందర్బంగా అనుజ కూడా తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: అక్కినేని హీరోలకు దోశం ఉంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..

Advertisement

Next Story