- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దానికి ఒప్పుకోకపోవడం వల్లే జబర్దస్త్ బ్యూటీ ప్రియుడికి బ్రేకప్ చెప్పిందా?
దిశ, సినిమా: బుల్లితెర నటి పవిత్ర మొదట టిక్‌టాక్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ షోలో తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అద్భుతమైన టాలెంట్లతో అదరగొడుతున్న ఈ చిన్నది పలు బుల్లితెర షోస్‌లోనూ పాల్గొంటుంది. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి పలు వీడియోలు చేసి షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాను సంతోష్ అనే కుర్రాడిని ప్రేమిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న విషయం తెలిసిందే. సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా ఓ పోస్ట్ పెట్టి అందరికీ షాకిచ్చింది.
ఇద్దరి ఇష్టంతో తాము బ్రేకప్ చెప్పుకుని విడిపోతున్నామని ఈ కష్ట సమయాల్లో తోడుగా ఉండాలని అభిమానులను కోరుతూ పోస్ట్ షేర్ చేసింది. తాజాగా, పవిత్ర తన ప్రియుడికి బ్రేకప్ చెప్పడానికి ఓ కారణం ఉందంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి తర్వాత యాక్టింగ్ చేయడానికి ప్రియుడి ఒప్పుకోనందుకే బ్రేకప్ చెప్పిందని టాక్. ప్రస్తుతం పవిత్ర బ్రేకప్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో అది చూసిన వారు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారో లేక ఫ్రాంక్ చేశారో తెలియాలంటే పవిత్ర స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.
Read More..
రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ జీతం ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!!