లావణ్య త్రిపాఠి, వరుణ్ ప్రేమ వ్యవహారాన్ని ముందు పసిగట్టింది ఆ నిర్మాతే

by Anjali |   ( Updated:2023-06-10 14:10:55.0  )
లావణ్య త్రిపాఠి, వరుణ్ ప్రేమ వ్యవహారాన్ని ముందు పసిగట్టింది ఆ నిర్మాతే
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్నాళ్ల నుంచి ఎవరికి తెలియకుండా సైలెంట్‌గా ప్రేమాయణం నడిపిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిన్న (జూన్ 9) ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. నిశ్చితార్థం అయ్యేవరకు వీరిద్దరి లవ్ స్టోరీపై చాలామందికి సందేహంగానే ఉండేది. కానీ ఎంగేజ్‌మెంట్‌తో సోషల్ మీడియాలో పుకార్లకు చెక్ పెట్టేశారు. అయితే తాజాగా ఈ లవ్ కపుల్ ఎఫైర్ గురించి ఆసక్తికర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితమే అల్లు అరవింద్.. లావణ్య, వరుణ్ ప్రేమని పసిగట్టారట. ‘‘చావు కబురు చల్లగా’’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ హీరోయిన్ మాట్లాడుతుండగా అల్లు అర్జున్ నాన్న మధ్యలో మైక్ తీసుకుని.. ‘‘ ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు భాష చాలా చక్కగా మాట్లాడుతున్నావు. ఈ టాలీవుడ్‌లోనే ఓ కుర్రాడిని చూసి వివాహం చేసుకోని ఇక్కడే సెటిల్ అయితే బాగుంటుందని’’ అల్లు అరవింద్ చెప్పాడు. దీంతో లావణ్య ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‘‘ వీరిద్దరు పెళ్లి చేసుకోబోయేది అల్లు అరవింద్‌కు ముందుగానే తెలుసు, అందుకే ఆయన ఆ మాట అన్నారని నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి:

నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగిన వరుణ్‌, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్‌

భర్తతో విడిపోయిన మెగాడాటర్ నిహారిక ..వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్‌తో క్లారిటీ వచ్చినట్లేనా?

వరుణ్ తేజ్.. లావణ్యకు తొడిగిన రింగ్ ఖరీదెంతో తెలుసా?

Advertisement

Next Story