టాలీవుడ్‌లో ఐటీ సోదాల కలకలం.. టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రొడ్యూసర్ ఆఫీస్‌లో రైడ్స్

by Satheesh |   ( Updated:2023-10-11 07:28:56.0  )
టాలీవుడ్‌లో ఐటీ సోదాల కలకలం.. టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రొడ్యూసర్ ఆఫీస్‌లో రైడ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్‌లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఆఫీసులో ఐటీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ కార్యాలయంలో లావాదేవీలు, పన్ను చెల్లింపుల రికార్డులను పరిశీలిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇతను కిర్రాక్ పార్టీ, గూడాచారి, సీత, కార్తికేయ2, కాశ్మీర్ ఫైల్స్ వంటి తదితర సినిమామాలకు ప్రొడ్యూసర్, సహ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. కాగా టాలీవుడ్‌లో ఇటీవల ఐటీ సోదాలు సంచలనంగా మారుతున్నాయి. పన్ను ఎగవేశారన్న సమాచారంతో ఈ ఏడాది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలపై ఐటీ తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story