ఆ హీరో వల్లనే సమంతతో నటించడానికి ఏ హీరో ముందుకు రావడం లేదా?

by samatah |   ( Updated:2023-04-15 08:12:40.0  )
ఆ హీరో వల్లనే సమంతతో నటించడానికి ఏ హీరో ముందుకు రావడం లేదా?
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా వచ్చాక, వింతలు వినోదాలే కాదు గాసిప్స్‌కు కూడా కొదవే లేకుండా పోయింది. సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో రూమర్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించి ఏదో ఒక పుకారు నెట్టింట్లో షికారు చేస్తూనే ఉంటుంది.

అయితే సమంతతో నటించడానికి స్టార్ హీరోస్ అస్సలు ఒప్పుకోవడం లేదంట. అసలు విషయంలోకి వెళ్లితే.. సమంత తెలుగుచిత్ర పరిశ్రమకు పరిచయమైన మొదట్లో వరసగా బడా హీరోలతో నటిస్తూ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో ఆమెతో నటించడానికి ఏ హీరో కూడా ఒప్పుకోవడం లేదట. దానికి కారణం సమంత అక్కినేని మాజీ కోడలు కావడమే అంటున్నారు కొందరు.

ఎంతైనా సమంత బడా ఫ్యామిలీకి చెందిన మాజీ కోడలు, నాగచైతన్య మాజీ భార్య, ఆమెతో మేము సినిమాల్లో ఎలా నటించగలం, మూవీలో రొమాంటిక్ సీన్స్ వస్తే ఆమెతో నటించడానికి మేము సిద్ధంగగా లేము అంటూ సామ్‌ని రిజక్ట్ చేస్తున్నారంట. అందువల్లనే ఈ మధ్యకాలంలో రానా కూడా దుష్యంతుని పాత్రలో నటించడానికి ఆసక్తి చూపలేదం. దీంతో చైతూని పెళ్లి చేసుకోవడం వల్లనే సమంత సినిమాలకు దూరం అవుతుంది అంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read more:

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్‌కు రూ. 80 కోట్ల ఖర్చు.. అందుకే సంతృప్తి పొందామన్న కార్తికేయ

Advertisement

Next Story

Most Viewed