- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ తెలంగాణ, ఏపీలో ఓటు వేయలేదా?.. ఒక బాధ్యత గల పౌరుని లక్షణం ఇదేనా అంటూ ఏకిపారేస్తున్న జనం
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది ‘సలార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ అదే ఫామ్‌లో ప్రజెంట్ ‘సలార్-2’, స్పిరిట్, రాజా సాబ్, కల్కి, వంటి చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా మారిపోయాడు. అలాగే హను రాఘవపూడితో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశాడు. దీంతో గత కొద్ది కాలంగా సోషల్ మీడియాకు దూరం అయ్యాడు. కల్కి షూటింగ్‌లో పాల్గొంటూ తన లుక్స్‌ను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఈ సినిమా జూన్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో అప్పుడప్పుడు ప్రభాస్ ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా నిన్న తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. దీంతో ప్రతి పౌరుడు, సినిమా హీరోలు తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు పోలింగ్ బూత్స్ వద్దకు వచ్చారు. అయితే ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభాస్ కనిపించకపోతే.. తన ఓటు ఏపీలో ఉంది కావచ్చు అని అందరూ భావించారు.
కానీ ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కూడా ప్రభాస్ ఎక్కడ కనిపించకపోయేసరికి ప్రభాస్ అసలు వేసారో లేదో అన్న సందేహం మొదలైంది. ప్రభాస్ ఇటు తెలంగాణలో, అటు ఏపీలో ఏ పోలింగ్ బూత్ దగ్గర కనిపించకపోవడంతో ఒక పాన్ ఇండియా హీరో పొజిషన్ లో ఉన్న ప్రభాస్.. తన ఓటు హక్కును ఉపయోగించుకోకుండా, తన అభిమానులకు ఎలాంటి మెసేజ్ ని ఇస్తున్నారు. ఇదేనా ఒక బాధ్యత గల పౌరుని లక్షణం. అంటూ ప్రభాస్ ను ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతుంది.