మహేష్ బాబు ప్రత్యేకంగా జర్మనీ డాక్టర్‌ను కలవడానికి కారణం ఇదే?

by Anjali |
మహేష్ బాబు ప్రత్యేకంగా జర్మనీ డాక్టర్‌ను కలవడానికి కారణం ఇదే?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమా విడుదలై వారం దాటుతోన్న థియేటర్లలో ఇంకా సందడి తగ్గలేదు. ఈ చిత్రం భారీగానే వసూళ్లు సాధించింది. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం కలెక్షన్స్ రాలేకపోయాయి. ఇకపోతే.. టాలీవుడ్ దర్శకధీరుడు-సూపర్ స్టార్ కాంబోలో ఓ చిత్రం రాబోతుందని తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడు స్టోరీగా మూవీ భారీ యాక్షన్ అడ్వెంచర్‌తో ఉండబోతోందని సమాచారం. హాలీవుడ్ స్థాయిలో మహేష్ చిత్రాన్ని రూపొందించేందుకు రాజమౌళి భారీ ప్రణాళిక సిద్ధం చేశారట. అయితే రీసెంట్‌గా సూపర్ స్టార్ జర్మనీకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రిన్స్ ఏ పని మీద వెళ్లాడో జనాలకు క్లారిటీ లేక నెట్టింట పలు పుకార్లు సృష్టించారు. తాజాగా మహేష్ జర్మనీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అసలు విషయం బయటికొచ్చింది.

అయితే జక్కన్న సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లోనే ఉంటుందట. అడ్వెంచర్, యాక్షన్ స్టంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. సూపర్ స్టార్‌కు ఫిట్‌నెస్ చాలా అవసరం. కాగా సూపర్ స్టార్ హరీ కోనిగ్ అనే జర్మనీలోని బాడీ ఫిట్నెస్, ఫిజియో ఎక్స్పర్ట్ సంబంధించిన ఓ డాక్టర్‌ను సంప్రదించి.. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఫిట్నెస్ అవసరం అనే దానిపై సూపర్ స్టార్ ఆ డాక్టర్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం అమెజాన్ అడవుల్లో జక్కన్న-మహేష్ బాబు చిత్ర షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

Next Story

Most Viewed