ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా?.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిన యాంకర్ సుమ!

by Kavitha |
ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా?.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిన యాంకర్ సుమ!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతా వేసుకున్నాడు. అలాగే మరో 6 సినిమాలకు ఓకే చేసి బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా డార్లింగ్‌కి ప్రస్తుతం 44 సంవత్సరాలు. ఈ పాటికే తన తోటి నటీనటులు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసి హ్యాపి లైఫ‌ను లీడ్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉన్నాడు. ఇక మ్యారేజ్ గురించి అడిగితే మాత్రం ఓ చిన్న స్మైల్ ఇచ్చి ఫేస్ తిప్పేస్తున్నాడు.

అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి ఓ కారణం ఉందంట. ఈ విషయాన్ని స్టార్ యాంకర్ సుమ రీసెంట్‌గా ప్రకటించినది. తాజాగా ఓ ఈవెంట్‌లో ప్రభాస్‌ను కలిసి నప్పుడు పెళ్లి గురించి అడిగానని సుమ చెప్పారు. అప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం చెప్పినట్లు సుమ అన్నది. ఇంతకీ ఆ కారణం ఏంటంటే.. నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయిల హార్ట్ బ్రేక్ అవుతుందని అలా కాకూడదనే పెళ్లి చేసుకోవట్లేదని ప్రభాస్ చెప్పాడని సుమ చెప్పింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇంకేదైనా ఇంపార్టెంట్ విషయం చెప్తది అనుకుంటే ప్రభాస్ వేసిన జోనును చెప్పి ఫ్లవర్‌ను చేసిందిగా యాంకర్ సుమ అంటూ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed