పూరి జగన్నాథ్ ఆర్థిక సమస్యల వల్లే డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆలస్యం అవుతుందా?

by Prasanna |
పూరి జగన్నాథ్ ఆర్థిక సమస్యల వల్లే డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆలస్యం అవుతుందా?
X

దిశ, సినిమా : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం లైగర్. ఈ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు, ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ మరో సినిమా చేస్తాడా అనే అనుమానాలు కూడా కొందరికి వచ్చాయి.

అయితే, బ్లాక్ బస్టర్ అయిన 'ఇస్మార్ట్ శంకర్ ' చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్'ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో సక్సెస్ అవుతాడని అంతా అనుకుంటున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులవుతున్నా.. చిత్రీకరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి పూరీ జగన్నాథ్ స్వయంగా నిర్మాత. లైగర్ సినిమా వల్ల పూరీ జగన్నాథ్ భారీ నష్టాన్ని చవిచూశారు. ఈ సినిమాతో వందల కోట్లు నష్టపోయిన పూరీ జగన్నాథ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే డబుల్ ఇస్మార్ట్ ను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడని అని వార్తలు వినిపించాయి.

అయితే, లైగర్ సినిమాతో పెద్ద నష్టాన్ని చవిచూసిన పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాకి ఖర్చులు తగ్గించుకుందని అంటున్నారు. దాంతో, ఈ సినిమా మళ్లీ మొదలు పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నష్టాన్ని పూరీ జగన్నాథ్ 'లైగర్'తో భర్తీ చేస్తాడో లేదో చూడాలి.

Advertisement

Next Story