కాజల్ అంత పెద్ద సమస్యతో బాధపడుతోందా.. పాపం

by Anjali |   ( Updated:2023-10-19 14:24:00.0  )
కాజల్ అంత పెద్ద సమస్యతో బాధపడుతోందా.. పాపం
X

దిశ, సినిమా: అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ‘చందమామ’, ‘మగధీర’ బిగ్ హిట్స్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే కెరీర్‌లో మంచి జోరుమీదుండగానే పెళ్లి చేసుకుని ఆ వెంటనే ప్రెగ్నెంట్ అయింది. దీంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇక ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస భారీ చిత్రాలు చేస్తూ మళ్లీ బిజీ అయింది. అయితే తాజాగా కాజల్ తన అనారోగ్యానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

‘ఎంత డైట్ చేసినా.. ఎన్ని వర్కౌట్స్ చేసినా.. నా శరీరానికి ఏమీ కాదు. ఎక్కవ ఫుడ్ తిన్నా బరువు పెరగను. కానీ ఓ నాలుగు రోజులు జిమ్‌కు వెళ్లకపోతే మాత్రం చాలా బరువు పెరిగిపోతా. ఇక పెరిగిన కొవ్వును తగ్గించుకోవడానికి మరో నాలుగు రోజులపాటు జిమ్‌లో చాలా కష్టపడాలి’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed