Ileana: ఇలియానా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేస్తుందా? కారణమిదే!

by Harish |   ( Updated:2022-05-20 13:19:17.0  )
Ileana: ఇలియానా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేస్తుందా? కారణమిదే!
X

దిశ, సినిమా : 'దేవదాసు' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన గోవా బ్యూటీ ఇలియానా(Ileana).. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన భామ.. బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చే వరకు కూడా ఆ స్థానంలో నీరాజనాలు అందుకుంది. హిందీ ఇండస్ట్రీలో సైతం కంటెంట్ ఉన్న సినిమాలు చేసిన ఇల్లీ బేబీ.. బాయ్ ఫ్రెండ్‌తో ప్రేమలో మునిగాక కెరీర్ కొలాప్స్ అయింది. ఇక బ్రేకప్ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన భామ.. ఆఫర్లను తిరస్కరిస్తూ వచ్చింది. కానీ కోలుకునే లోపు ఇండస్ట్రీ ఆమెను దూరం పెట్టినట్టు అయింది. ఇటు తెలుగులోనూ సెకండ్ ఇన్నింగ్స్‌లో సక్సెస్ అందుకోలేకపోయిన ఆమె.. ప్రస్తుతం హిందీ సినిమా 'అన్‌ఫెయిర్ లవ్లీ'పైనే పూర్తి ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే ఓకే లేదంటే పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తుందనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story