Viva Harsha: కమెడియన్ వైవా హర్ష విడాకులు తీసుకుంటున్నాడా.. ధైర్యంగా నిలబడి స్ట్రాంగ్‌గా తిరిగొస్తానంటూ క్లారిటీ

by Prasanna |
Viva Harsha: కమెడియన్ వైవా హర్ష విడాకులు తీసుకుంటున్నాడా.. ధైర్యంగా నిలబడి స్ట్రాంగ్‌గా తిరిగొస్తానంటూ క్లారిటీ
X

దిశ, సినిమా: షార్ట్ ఫిల్మ్స్ తో తన సినీ కెరీర్ ను మొదలు పెట్టిన వైవా హర్ష గురించి ప్రత్యేకంగా చెప్ప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లో అవకాశం తెచ్చుకుని నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం హీరో ఫ్రెండ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడు.

కొద్దీ రోజుల క్రితం జీవితం గురించి ఓ లెవెల్లో పోస్ట్ చేసాడు. జీవితంలో ఎవరి నుంచి ఏది తర్వాత చాలా బాధ పడాల్సి ఉంటుందంటూ పోస్ట్ చేసాడు. ఇది చూసిన ఫ్యాన్స్ హర్షకు ఏమైంది? తన భార్యతో ఏదైనా గొడవ జరిగి ఉంటుందా.. విడాకులు ఇస్తున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పుకార్ల పై ఘాటుగానే సమాధానమిచ్చాడు హర్ష. దీని కోసం పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

"మనం ఒకసారి కింద పడిపోయినప్పుడే తిరిగి ఎలా లేచి నిలబడాలో తెలుసుకుంటాం. నేను ఇంతక ముందు పెట్టిన పోస్ట్ పై ట్రోల్స్ చేస్తున్న వారికీ ధన్యవాదాలు. నా జీవితం గురించి ఆరా తీసేవాళ్లు ఇంతమంది ఉన్నారా? దీనికి నేను సంతోషిస్తున్నాను. కానీ, నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నేను చేసుకునే పని దగ్గరే ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అక్కడే అందరూ పాలిటిక్స్ చేస్తున్నారు. అది అసలు నచ్చడం లేదు. దీని వల్ల చాలా బాధ పడుతున్నాను ఎన్ని సమస్యలు వచ్చిన ధైర్యంగా నిలబడి మరింత బలంగా స్ట్రాంగ్‌గా తిరిగొస్తానంటూ " పోస్ట్ లో రాసుకొచ్చాడు.

Advertisement

Next Story