- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
RGV వ్యూహం సినిమాకు మళ్లీ బ్రేక్.. ఎక్కడా విడుదల చేయొద్దని కోర్టు ఆదేశం
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే, రాజకీయాల నేపథ్యంలో ఉండటంతో ఈ సినిమాకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. ముందుగా సెన్సార్ బోర్డు విడుదలకు అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత కొన్ని చేంజెస్ చేసి ఎలాగోలా సెన్సార్ నుంచి అడ్డంకులను ఆర్జీవీ క్లియర్ చేసుకున్నారు. ఇక విడుదలకు వారం రోజులే ఉందనగా.. రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల ఈ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణకు స్వీకరించిన కోర్టు ‘వ్యూహం’ సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ, ఆన్‌లైన్, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది. చిత్రాన్ని నిర్మించిన రామదూత క్రియోషన్స్‌తో పాటు దర్శకుడు రాంగోపాల్ వర్మకు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. కాగా, ఇవాళ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు విజయవాడలో గ్రాండ్‌గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.
Read More..
హృతిక్ రోషన్- దీపిక రొమాంటిక్ సాంగ్ విడుదల.. పిచ్చెక్కిస్తున్న సీన్స్..