జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు

by M.Rajitha |
జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్ : తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక దాడికి పాల్పడిన కేసులో టాలీవుడ్(Tollywood) ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johny Master) అరెస్టయిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ లభించింది. తాను నేషనల్ అవార్డు గెలుచుకున్నందున, దానిని అందుకోవడం కోసం ఢిల్లీ వెళ్లాల్సి ఉందని, అందుకోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్ట్ ఈ నెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జానీ మాస్టర్ పోలీసు కస్టడీలో ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను, బాధితులను బెదిరించే అవకాశం ఉందని, బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.

Next Story

Most Viewed