'Unstoppable 2'టాక్ షో‌లో ఆసక్తికర చర్చ..అది ఏంటంటే

by Prasanna |   ( Updated:2023-01-06 09:56:38.0  )
Unstoppable 2టాక్ షో‌లో ఆసక్తికర చర్చ..అది ఏంటంటే
X

దిశ, సినిమా : ప్రస్తుతం " అన్ స్టాపబుల్ 2 " టాక్ షో ఆహా ప్లాట్ ఫామ్ పై దూసుకుపోతోంది. ఈ ప్రోగ్రామ్‌లో ప్రభాస్, గోపీచంద్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాలయ్యతో కలిసి ప్రభాస్, గోపీచంద్ భలే సందడి చేశారు. తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ ఒక మూవీ చేస్తున్నాడు. గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. గోపీచంద్ ప్రతీ మూవీ టైటిల్‌లో ఎండింగ్‌లో 'సున్నా' వస్తూ ఉంటుంది. అందుకే ఈ సినిమాకు 'రామబాణం' అనే టైటిల్ పెట్టుకోవాలని బాలకృష్ణ సూచించాడు. 100 డేస్ ఫంక్షన్‌కు తాను కూడా వస్తానని మాటిచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ హోమ్ బ్యానర్‌లో 'జిల్ ' మూవీ ఎలా సెట్ అయిందని గోపీచంద్‌ను అడిగాడు బాలయ్య. అందుకు గోపీచంద్ స్పందిస్తూ..'రాధాకృష్ణ కుమార్ 'జిల్' స్టోరీతో వచ్చినప్పుడు ప్రభాస్ విన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందిరా చేసేయ్ అన్నాడు. అయితే ఈ మూవీలో మాత్రం రెగ్యులర్ లుక్‌తో కనిపించవద్దు..హెయిర్ స్టయిల్ మార్చు' అని దగ్గరుండి నా గెటప్ మార్పించాడు ప్రభాస్' అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు. బాలయ్య కూడా 'నిజమే ఆ లుక్ సూపర్..వెరీ స్టయిలిష్' అంటూ బాలయ్య కామెంట్ చేశారు.

Also Read...

Naresh-Pavitra పెళ్లిపై రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్!

Advertisement

Next Story