- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సినిమా కమిట్ అయ్యే ముందు అలా చేస్తా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా : నేషనల్ క్రష్ రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని లక్కీ గర్ల్‌గా పేరు సంపాదించుకుంది.
ఇక ఆ తర్వాత నటించిన గీతా గోవిందం సినిమా ఈ బ్యూటీ లైఫ్ టర్న్ చేసిందని చెప్పవచ్చు. తర్వాత నేషనల్ క్రష్ వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోల అందరిసరసన ఆడిపాడి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో అదరగొట్టింది. ఈ మూవీ తర్వాత రష్మిక టాప్ పొజిషన్ అందుకొని, పాన్ ఇండియా లెవల్‌లో మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా యానిమల్ మూవీలో రణ్ వీర్ సింగ్ సరసన నటించి ఔరా అనిపించింది. దీంతో మళ్లీ ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్‌కు పైగా బడా ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే రష్మికకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఆమె తన సినిమాల గురించి మాట్లాడుతూ.. నేను మూవీ ఓకే చేసే ముందు పాత్రలను చూస్ చేసుకుంటాను.నేను కమిట్ అయ్యే సినిమాలో ఏదైనా మెసేజ్ ఉండాలని ఆలోచిస్తాను. అలాంటి పాత్రలే ఒకే చెప్తానంటూ చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై రష్మిక స్పందిస్తూ అలాంటివి పెద్దగా పట్టించుకోను ,కెరీర్ స్టార్టింగ్ లో బాధ అనిపించినా, మెల్లమెల్లగా మర్చిపోవడం స్టార్ట్ చేశాను అని చెప్పుకొచ్చింది.