- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lavanya-Varun Tej: వరుణ్ తేజ్‌తో ఆ పని చేపించుకున్న లావణ్య.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న మెగా ఫ్యాన్స్
దిశ, సినిమా: టాలీవుడ్ లొట్ట చెంపల హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా అడుగుపెట్టినప్పటి నుంచి తరచూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తూనే ఉంటుంది. ఈ భామ అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి మిస్టర్ సినిమాతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లింది. ఏడడుగుల బంధంతో ఒక్కటైన ఈ జంట సినిమాల్లో నటిస్తూనే ఓ వైపు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇకపోతే లావణ్య ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంట్లో మీ భర్త వరుణ్ తేజ్ పర్ఫెక్టా? మీరా? అని అడగ్గా.. దీనికి లావణ్య బదులిస్తూ..
‘వరుణ్ ఫర్ఫెక్ట్. ఎందుకంటే.. ఆయనకు ఇల్లు చాలా క్లీన్‌గా ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు వరుణ్ ఇల్లును క్లీన్ గా ఉంచాలని చూడడం, సర్దడం లాంటివి చేస్తుంటారు. అంతేకాకుండా ఆయన మూడ్ బాలేకున్నా ఏదో ఒక వర్క్ చేస్తారు. మేం టూర్ వెళ్లినప్పుడు అక్కడ నా బట్టలు, వస్తువులు కూడా చక్కబెట్టాడు’ అని లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూలో గట్టిగా నవ్వేస్తుంది. ఈ బ్యూటీ కామెంట్లు విన్న నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వరుణ్ తేజ్‌ను ఓ రేంజ్‌లో కంట్రోల్‌లో పెట్టిందిగా, పాపం ఒక హీరోకు ఎన్ని కష్టాలో, ఏకంగా మెగా హీరోతోనే లావణ్య బట్టలు సర్దిపించుకుంటుందా? అంటూ కొంతమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. భర్య భర్తలన్నాక అవన్నీ కామన్ అంటూ మరికొంతమంది వీటిని కొట్టిపారేస్తున్నారు.