అలాంటి వాటిపై ఆసక్తి పెరిగింది.. అందుకే ఈసారి కొత్తగా ట్రై చేశా.. శ్రీ లీల ఆసక్తికర కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-09-28 12:33:51.0  )
అలాంటి వాటిపై ఆసక్తి పెరిగింది.. అందుకే ఈసారి కొత్తగా ట్రై చేశా.. శ్రీ లీల ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌ ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీ లీల, రామ్ కలిసి నటించిన చిత్రం స్కంద. ఈ మూవీ నేడు థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ ధమాకా తర్వాత స్కంద ద్వారా ప్రేక్షకులను పలకరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు చూపించే ప్రేమాభిమానాలకు థ్యాంక్స్. వారిని మంచి చిత్రాలతో అలరించడమనేదే నా ప్రయత్నం. ఈ సినిమాలో నేను రూల్స్ పాటించే అమ్మాయిగా నటించా. ఓ వైపు మాస్ మరోవైపు క్లాస్‌గా కనిపిస్తాను. ఇందులోని కొన్ని సన్నివేశాలు నా జీవితానికి దగ్గరగా ఉంటాయి. నటించేటప్పుడు కాదు డబ్బింగ్ సమయంలోనూ ఎంజాయ్ చేశాను.

రామ్‌తో నా కెమిస్ట్రీ బాగుంటుంది. కానీ ఆయనలా డ్యాన్స్ చేయడం కష్టం. డ్యాన్స్ విషయంలో ఈసారి కొత్తగా ట్రై చేశా. నటన, డ్యాన్స్ పరంగా రమ్ కొన్ని సలహాలు ఇచ్చారు. ధమాకాలోని నా డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని అనుకోలేదు. స్కంద లోనూ అదే స్థాయిలో ఉంటుంది. ఈ చిత్రంతో యాక్షన్ కథలపై మరింత ఇష్టం పెరిగింది. మాస్ అంశాలు, పోరాట సన్నివేశాలను అద్భుతంగా చూపించడంలో బోయపాటి శ్రీనుది ప్రత్యేక శైలి. ఇలాంటి జానర్‌లో నటించడం నాకు కొత్త. దాంతో దర్శకుడు ఇచ్చిన ఇన్‌పుట్స్ మేరకు నటించా. నేను కథల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story