- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. భారీగా పడిపోయిన జవాన్ కలెక్షన్స్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన జవాన్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. వరుసగా మూడు రోజులు భారీ కలెక్షన్లు రాబట్టిన జవాన్ మూవీ.. సోమవారం భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కారణంగా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ సినిమా తన ఐదో రోజైన సోమవారం.. రూ. 30 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇది అంతకు ముందు శని, ఆదివారాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. అలాగే ఈ రోజు మంగళవారం కూడా భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ ఉండటం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే జవాన్ నిర్మాతలు మాత్రం.. సోమవారం ఈ కలెక్షన్లు రావడం పెద్ద విషయం అంటున్నారు. జవాన్ మొదటి రోజు ఇండియాలో 75 కోట్లు, రెండో రోజు రూ.58.23 కోట్లు, శని, ఆదివారాల్లో అత్యధికంగా రూ.77.83 కోట్లు, రూ.80.1 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ నుంచి సోమవారం నాటి వసూళ్లను కలుపుకుంటే, టోటల్ ఇండియా నికర వసూళ్లు రూ.316.16 కోట్లకు చేరాయి. ఈ చిత్రం ఓవర్సీస్ నుంచి రూ. 177 కోట్లు రాబట్టింది కాబట్టి 5వ రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా టోటల్ కలెక్షన్స్ రూ.520 కోట్లకు చేరుకుంది. ఈ ట్రెండ్స్ ఇలానే కొనసాగితే జవాన్ సినిమా 1000 కోట్లు కొల్లగొట్టనుంది.
Read More: చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. Upasana ధరించిన డ్రెస్ ఖరీదేంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!