'Unstoppable Season 2 సెకండ్ సీజన్‌.. ఫస్ట్ గెస్ట్‌గా సమంత?

by Hajipasha |   ( Updated:2022-09-25 13:51:17.0  )
Unstoppable Season 2 సెకండ్ సీజన్‌.. ఫస్ట్ గెస్ట్‌గా సమంత?
X

దిశ, సినిమా: ఇటీవల ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో ప్రసారమైన క్రేజీ షో 'అన్ స్టాపబుల్'. ఈ షోకు మొదటిసారి హోస్ట్‌గా వ్యవహరించిన బాలకృష్ణ ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించారు. అంతేకాదు తన మాటలతో షోకు ఫుల్ జోష్ తీసుకురాగా.. త్వరలోనే సెకండ్ సీజన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్‌కు సమంత‌ను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ముందుగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ను తీసుకురావాలనుకున్నప్పటికీ.. షూటింగ్‌లో బిజీ ఉండటం వల్ల సమంత ఫస్ట్ గెస్ట్‌గా వస్తున్నట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

ధమాకా' కోసం రచయితగా మారిన హైపర్ ఆది

Advertisement

Next Story