ప్రభాస్ విషయంలో నా జీవితంలో నాకు తగిలిన ఎదురుదెబ్బ అది.. నిత్యామీనన్ సంచలన కామెంట్స్

by Kavitha |
ప్రభాస్ విషయంలో నా జీవితంలో నాకు తగిలిన ఎదురుదెబ్బ అది.. నిత్యామీనన్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన నిత్యామీనన్ అందరికీ సుపరిచితమే. తన అందం, అభినయంతో ఆకట్టుకుని ప్రేక్షకులను కట్టిపడేసింది. కేవలం కళ్ళతోనే హావభావాలు పలికించే ముద్దుగుమ్మ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నితిన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నాని, సూర్య వంటి స్టార్స్‌తో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. చివరిగా ‘తిరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చి వెబ్ సిరీస్‌లు, మూవీలతో బిజీగా ఉంటోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే అలా మొదలైంది సినిమా ప్రమోషన్స్‌లో నిత్యామీనన్‌ని ప్రభాస్ గురించి అడిగారు. అప్పుడు ఆమె ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఈ బ్యూటీని దారుణంగా ట్రోల్స్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. ఇక ఆమె ఎక్కడికి వెళ్ళిన మీడియా వాళ్లు కూడా ఆమెని ప్రశ్నించడం మొదలు పెట్టారు. టాలీవుడ్‌లో సినిమా చేస్తున్నావ్ ప్రభాస్ ఎవరో తెలియదా అని అడిగారట.

ఈమెకి బాగా పొగరు అందువల్లే ఇలా బిహేవ్ చేస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. ఈ సంఘటనతో తనకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదని నిత్య మీనన్ తెలిపింది.ఎందుకంటే నేనప్పుడు చాలా చిన్న అమ్మాయిని. సినిమాల గురించి ఏమీ తెలియదు. తెలుగు సినిమాలు అసలే చూడలేదు. చిత్ర పరిశ్రమలో ఎవరెవరు ఉన్నారో కూడా నాకు అవగాహన లేదు. ప్రభాస్ గురించి అడగగానే తెలియదు కాబట్టి తెలియదు అనే చెప్పా. దానికి ఏదో పాపం చేసినట్లు నన్ను మానసికంగా వేధించారు. అది నా జీవితంలో బలంగా తగిలిన ఎదురుదెబ్బ అని నిత్య మీనన్ తెలిపింది. ఆ సంఘటన తర్వాత చాలా నేర్చుకున్నా. ప్రతి చోటా నిజాయతీగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నా అని నిత్యా మీనన్ తెలిపింది. కనీసం చిన్న పిల్లని అని కూడా చూడకుండా.. నా అమాయకత్వంతో వాళ్లంతా ఆడుకున్నట్లు నిత్యా మీనన్ వాపోయింది.

Advertisement

Next Story