- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Superstar: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోన్న మహేష్ బాబు.. మరో స్టైలిష్ లుక్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇన్నేళ్లైనా ఇప్పటికి యంగ్ లుక్‌తో జనాల్ని అలరిస్తున్నాడు. సూపర్ స్టార్ నటించిన చివరగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం గుంటూరు కారం.. బాక్సాఫీసు వద్ద నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. ఫ్యాన్స్‌కు ఆ లోటు తీర్చేందుకు.. డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సూపర్ స్టార్ సిద్ధమవుతోన్నారు. ఏకంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టాడు. ఈయన దర్శకత్వంలో ప్రిన్స్ ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు.
జక్కన్న దర్శకత్వం వహిస్తోన్న చిత్రం కోసం అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం మహేష్ బాబు భారీ గడ్డం, బాడీ పెంచిన విషయం తెలిసిందే. భారీ వర్కౌట్స్ చేస్తూ మన హీరో తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రిన్స్ మరోసారి అదిరిపోయే లుక్ తో కనిపించారు. అమెరికాలో ఉన్న తనయుడు గౌతమ్ దగ్గరికా? లేదా జక్కన్న వర్క్ కోసమా? అని క్లారిటీగా తెలియదు కానీ ప్రస్తుతం సూపర్ స్టార్ విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మార్నింగ్ హైదరాబాదు ఎయిర్ పోర్ట్‌లో నమ్రత-మహేస్ బాబు కనిపించారు. మహేష్ స్టైలిష్ హుడీ ధరించారు. క్యాప్ పెట్టుకుని, లాంగ్ హెయిర్ అండ్ గడ్డంతో తెగ స్టైలిష్ గా ఉన్నారు. ప్రస్తుతం ప్రిన్స్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.