- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్.. ఫిల్మ్ చాంబర్ కఠిన నిర్ణయం
దిశ, సినిమా: హీరోహీరోయిన్లు, దర్శకుల భారీ రెమ్యునరేషన్స్‌కు బ్రేక్ వేసింది ఫిల్మ్ ఛాంబర్. ఒక్క సినిమాకు రూ. 60 కోట్ల నుంచి రూ.100కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న క్రమంలో.. ఈ నెల 10 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది. ఇప్పటి వరకు స్టార్ హీరో, హీరోయిన్స్ సహాయక సిబ్బందికి సంబంధించిన పూర్తి ఖర్చులు నిర్వాతలే చెల్లిస్తూ వచ్చారు. ట్రాన్స్‌పోర్ట్, పర్సనల్ స్టాఫ్, అకామిడేషన్, ఫుడ్‌కు సంబంధించిన అన్ని ఖర్చులు చూసుకున్నారు. కానీ ఇకపై ఆ ఖర్చులన్నీ హీరో హీరోయిన్లే చూసుకోవాలని రూల్స్ జారీ అయ్యాయి.
సినిమాలో పాత్రకు తగినట్లుగా పారితోషికాన్ని ఫిక్స్ చేయాలని, సినిమా ప్రారంభానికి ముందుగానే రెమ్యునరేషన్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవాలి అని సూచించింది. అలాగే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్.. ఓటీటీ రిలీజ్‌కు మధ్య కచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది. ఓటీటీ కారణంగా ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.