- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవ్ పార్టీలో నేను లేను.. నాకు సంబంధం లేని వాటిలో నన్ను లాగొద్దు: జానీ మాస్టర్
దిశ, సినిమా: బెంగుళూరు రేవ్ పార్టీ తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. చాలా మంది సెలబ్రిటీలు పట్టుబడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు సినీ నటుల పేర్లు బయటపడుతున్నాయి. కొందరు అత్యుత్సాహంతో కావాలనే దీనిలో లేని పేర్లు చెబుతున్నారు.
ఈ పార్టీలో సంబంధం లేని వ్యక్తులు అనవసరంగా లాగుతున్నారు. సినీ నటులు హేమ, శ్రీకాంత్ తదితరుల పేర్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు కూడా వచ్చింది. ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అకస్మాత్తుగా తన పేరు బయటకు రావడం పై జానీ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
'నాకు బాగా దగ్గరైన వాళ్ళందరికీ తెలుసు.. నాకు అలాంటి అలవాట్లు లేవని, నాకు సంబంధం లేని వాటిలో నన్ను లాగొద్దు, మా పవన్ కల్యాణ్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం మానుకుంటే బెటర్.. వార్తలు రాసేవాళ్ళు కూడా నిజాలేమి తెలుసుకోకుండా.. ఇష్టమొచ్చినట్టు షేర్ చేస్తున్నారు.. అలాంటి వారి మనస్థితిపై నాకు చాలా జాలేస్తుంది' అంటూ జానీ మాస్టర్ 'ఎక్స్'లో పోస్టు చేశారు.