కడుపులో బిడ్డ తంతుంది అంటూ ఇలియానా వైరల్ పోస్ట్

by Prasanna |
కడుపులో బిడ్డ తంతుంది అంటూ ఇలియానా వైరల్ పోస్ట్
X

దిశ, సినిమా: త్వరలో తల్లి కాబోతున్నానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్ ఇలియానా.. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రెండు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ షేర్ చేసి, తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. కాగా తాజాగా గర్భంలో బిడ్డ ఎదుగుతున్న క్రమంలో తన అనుభవాలు, అనుభూతులు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చింది. కునుకు తియ్యనివ్వడం లేదని, నిద్ర కోసం చాలా తంటాలు పడుతున్నానని చెబుతూ.. మంచంపై లేజీగా పడుకుని ఉన్న సెల్ఫీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇప్పటికీ తండ్రి ఎవరో చెప్పకుండా దాస్తుండటమే బాగా లేదంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed