- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్కకు ముద్దు పెడుతున్న ప్రియుడి ఫొటో షేర్ చేసిన ఇలియానా.. మండిపడుతున్న నెటిజన్లు
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘దేవదాసు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు సరసన ‘పోకిరి’ మూవీలో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఈ అమ్మడు కెరీర్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ ఎక్కువ ఆఫర్లు రాకపోవడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. పెళ్లి చేసుకోకుండానే ఇటివల తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోలు షేర్ చేసి అందరికీ షాకిచ్చింది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా, ఇలియానా తన ఇన్‌స్టా స్టోరీలో కుక్కకు ముద్దుపెడుతున్న ప్రియుడి ఫొటోను పెట్టింది. కానీ, అందులో అతని ముఖం కనిపించకుండా జాగ్రత్త పడింది. దీంతో ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరనేది సస్పెన్స్‌గా మిలిగిపోయింది. ఆ ఫొటోను చూసిన వారు రకరకాలుగా అనుకుంటున్నారు. అయితే గతంలో ఇలియానా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇలియానా మాత్రం స్పందించలేదు. దీంతో సెబాస్టియన్ వల్లే ఆమె ప్రెగ్నెంట్ అయిందని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.
Read More..
అప్పుడే ప్రేమలో పడ్డా.. ఇప్పటికే రెండు బ్రెకప్‌లు అయ్యాయి: మృణాల్ కామెంట్స్ వైరల్