సౌందర్య ముఖంపై కాలు పెడితే.. జనాలు కొడుతారేమో అని చాలా భయపడ్డా: స్టార్ హీరోయిన్

by Anjali |   ( Updated:2023-08-10 16:13:43.0  )
సౌందర్య ముఖంపై కాలు పెడితే.. జనాలు కొడుతారేమో అని చాలా భయపడ్డా: స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మోస్ట్ పవర్ ఫుల్ పాత్రలు చేసిన హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది హీరోయిన్ రమ్మకృష్ణ. ఈ భామ ఒక పాత్ర చేసిందంటే ఆ రోల్‌కే పవర్ వస్తుంది. ఇప్పటివరకు ఈ హీరోయిన్ చేసినవన్నీ పవర్ ఫుల్ పాత్రలనే చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ‘జైలర్’ చిత్రంలో రమ్యకృష్ణ రజినీ భార్యగా నటించింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రమ్మక‌ృష్ఱ మాట్లాడుతూ.. ‘నరసింహ సినిమాలో నేను సెకండ్ హీరోయినా? విలనా అనేది కూడా అస్సలు పట్టించుకోలేదు. కేవలం రజినీకాంత్ మూవీలో నేను ఉండాలనే ఆకాంక్షతోనే ఆ సినిమాకు ఓకే చెప్పాను.

అందులో సౌందర్య ఫేస్‌పై కాలు పెట్టే సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ చేసేటప్పుడు నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్ ముఖం మీద కాలు పెడితే ఆడియన్స్ నన్ను కొడుతారేమో అని టెన్షన్ పడ్డాను. ఏం కాదులే ఇదొక్క సీన్ మాత్రమే కదా? అని సౌందర్య ధైర్యం చెప్పడంతో దాన్ని ఈ సీన్‌ను పూర్తి చేశాను. ఆ చిత్రంలో రజినీకాంత్‌తో పోటీ పడి మరీ నటించాను. అప్పుడు నాకు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు జైలర్ సినిమాలో కూడా మా ఇద్దరి మధ్య వచ్చే సీన్లు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇది నాకు సెకండ్ ఇన్నింగ్స్‌లో గుర్తుండి పోయే పాత్ర అవుతుంది.’’ అంటూ రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story